TPT: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ జూన్ 1న నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు జరిగే నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజా సమస్యలపై గళమెత్తనున్నట్లు తెలిపారు.