MLG: భర్త కాపురానికి తీసుకెళ్లకుండా అవమానించడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన ములుగు మండలంలో వెలుగుచూసింది. బండారుపల్లి గ్రామానికి చెందిన ఆక్షయ చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఎంజీఎంలో మృతి చెందింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ములుగు ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు.