AP: నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విగ్రహం ధ్వంసం వ్యవహారంలో ఇతర పార్టీల ప్రమేయం లేదని తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పింది. నిందితుడు జమలయ్య YCP కార్యకర్తగా పోలీసులు గుర్తించినట్లు పేర్కొంది. ఘటనపై తప్పుడు ప్రచారం చేసినవారిపై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.