TG: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. కామారెడ్డి, పాలకుర్తి ఫిర్యాదులపై చర్చించినట్లు MP మల్లు రవి వెల్లడించారు. ఝాన్సీరెడ్డి, యశస్వినితో మాట్లాడి పరిష్కార మార్గం సూచించామన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు MLC శంకర్ నాయక్‌ను అబ్జర్వర్‌గా నియమించామని తెలిపారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు రావడంతో ఆయనకు నోటీసులు ఇచ్చామన్నారు.