ASF: సిర్పూర్ JK పేపర్ మిల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. కార్మికులు 12 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదని విమర్శించారు. కార్మికుల 10 డిమాండ్లను పరిష్కరించి, హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కోరారు.