BHPL: రానున్న రెండు రోజుల్లో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పంటలు, విద్యుత్ పరికరాలు, చెట్లు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.