TG: దేశంలో మొక్కజొన్నలు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘రాష్ట్రంలో ఇప్పటికే 14 లక్షల టన్నుల మక్కలు కొన్నాం. రాష్ట్రంలో కూలీలు, డీజిల్ కొరత ఉంది. గోదాములు నిండటంతో పొరుగు రాష్ట్రాలకు పంపుతున్నాం. మక్కల కొనుగోలు వల్ల నష్టం వచ్చినా రైతులను ఆదుకుంటాం. దేశంలో అత్యధికంగా వరి కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ’ అని తెలిపారు.