MBNR: దేవరకద్ర మండలం అజిలాపూర్ PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా సందర్శించారు. అక్కడ కొనుగోళ్లు, MSP చెల్లింపులపై రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన సులభతర ప్రక్రియతో ధాన్యం సకాలంలో అమ్ముడవుతోందని, డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.