కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రెన్స్ పరీక్షలు జూన్ 3 వరకు కొనసాగనున్నాయి. తొలి రోజు బ్యాచిలర్ ఫిజికల్ టెస్ట్‌లో 520 మంది, డిప్లమా విభాగానికి 190 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పురుషుల శారీరక సామర్ధ్య పరీక్షల్లో భాగంగా 100, 800 మీటర్ల రన్నింగ్, షాట్ పుట్, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించినట్లు సెక్రటరీ తెలిపారు.