KKD: కొత్తపల్లి మండలం అమీనాబాద్ రేవు వద్ద నిర్మిస్తున్న హార్బర్ గట్టును ఢీకొనడంతో పల్లేటి గాబ్రియల్కు చెందిన బోటు ధ్వంసమైంది. ప్రమాదాన్ని పసిగట్టిన ముగ్గురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో బోటు, వల ధ్వంసమై సుమారు నాలుగు లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు మత్స్యకారులు బుధవారం తెలిపారు.