శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం పరిధిలోని సిలగం సింగివలస గ్రామంలోని సాకేత రామ మందిరం వద్ద ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీరామ నవమి ఉత్సవాలను పురస్కరించుకుని తొమ్మిది రోజుల ముందుగానే ఆలయ ప్రాంగణంలో పందిరి రాట వేయడం జరిగింది. గ్రామస్తులు, భక్తులు కలిసి పూజలు నిర్వహించి, ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.