VZM: వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. బుధవారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం కల్తీ మద్యం తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో భాగస్వాములైన అందరిపైన మర్డర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.