GNTR: తెనాలి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు నాలుగు అర్జీలు వచ్చినట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి రెండు, రెవెన్యూ విభాగానికి సంబంధించి మరో రెండు అర్జీలు రాగా వాటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రామారావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, సిబ్బంది పాల్గొన్నారు.