ప్రకాశం: చంద్రశేఖరపురం మండల కేంద్రంలో మంగళవారం సీపీఐ నాయకులు మస్తాన్వలి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలందరికీ నివేశ స్థలాలు ఇవ్వాలని, అలాగే సాగు చేసుకునేందుకు భూమి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మస్తాన్వలి మాట్లాడుతూ.. పేదల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. అనంతరం తాసిల్దార్కు వినతిపత్రం అందజేశారు.