శ్రీకాకుళంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేస్తున్నది అభివృద్ధి కాదని, విధ్వంసమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు విమర్శించారు. శ్రీకాకుళంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. తీర ప్రాంతాన్ని ఆదానికి అప్పజెప్పడం, కార్గో ఎయిర్పోర్టు పేరుతో ఉద్దానంలో చెట్లు నరకడం, 38 వేల ఎకరాలను కార్పొరేట్లకు ఇవ్వడం వల్ల పర్యావరణం, వ్యవసాయం దెబ్బతింటుందన్నారు.