అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. బుధవారం నాటికి జలాశయం నీటిమట్టం వివరాలు 49.015 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 12వ క్రస్ట్ గేట్ ద్వారా 2750, పవర్ టన్నెల్ ద్వారా 1800 క్యూసెక్కులు పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు. కావలి కాలువకు 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.