VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై ప్రయాణిస్తున్న జి. గంగరాజు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. బలిజిపేట మండలం పణుకువలసకు చెందిన ఆయనను 108 అంబులెన్స్‌లో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.