NLR: మర్రిపాడు మండలం చిలకపాడు గ్రామంలో మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు అత్యవసర పరిస్థితిలో 108 సిబ్బంది గర్భిణీకి సురక్షిత ప్రసవం జరిపించారు. ఇష్టరీ అనే మహిళ పురిటి నొప్పులతో 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఎస్.కె మస్తాన్ మహిళను హాస్పిటల్‌కు తరలించేందుకు సమయం లేకపోవడంతో ప్రసవం జరపగా ఆడపిల్ల జన్మించింది.