KKD: జిల్లాలో జల జీవన్ మిషన్ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీటి సరఫరా పర్యవేక్షణ కోసం ప్రతినెలా గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు.