E.G: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఇంటి చోరీకి పాల్పడిన పెరుమళ్ళ రాజేశ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ సోమవారం తెలిపారు. నిందితుడి నుంచి ఒక జత వెండి పట్టీలు, రూ.18, వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ అదుపులోకి తీసుకుని, రిమాండ్ నిమిత్తం రాజమండ్రి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు.