ATP: గుత్తి మండలంలో మంగళవారం ఉరుముల, మెరుపులు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గత వారం రోజులుగా ఉక్కుపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించింది. మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో రోడ్డుపై మురికి నీరు రావడంతో వాహనాదారులు, పాదాచారాలు ఇబ్బందులు పడ్డారు.