కృష్ణా: కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ప్రజల ఆదాయం పెరిగిందని ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమాన్ని కూటమి నేతలు బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ అబ్జర్వర్ నూకాలమ్మలు ర్యాలీ నిర్వహించారు.