GNTR: పొన్నూరులో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అంగన్వాడీ సూపర్వైజర్లు, వర్కర్లకు 241 స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. పిల్లలు, తల్లుల సంక్షేమం, పౌష్టికాహారం, ఆరోగ్యం, ప్రాథమిక విద్యను అందించే ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరిచి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసును పెంపొందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.