AKP: కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు తెలిపారు. అర్హులైన వారికి త్వరలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించి టీడీపీ శ్రేణులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.