అన్నమయ్య: మదనపల్లెలో YCP యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోని YCP కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి, పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు.