కృష్ణా: ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ మంగళవారం విశాఖపట్నం పర్యటనకు వెళ్లారు. విశాఖపట్నంలో కొప్పరపు కవుల విగ్రహాలకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, శ్రీమాశర్మ పుష్పమాలతో నివాళులు అర్పించారు. సాయంత్రం ప్రముఖులు చాగంటి కోటేశ్వరరావుకు కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కార సభలో పాల్గొంటారు.