GNTR: అనధికార భవన నిర్మాణాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన గడువు ఈ నెల మార్చి 11తో ముగుస్తోంది. గత ఏడాది ఆగస్టు 31 లోపు నిర్మించిన భవనాలను తగిన రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గడువు ముగియడానికి మరో 4 రోజులే సమయం ఉండటంతో, మున్సిపల్ అధికారులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.