TG: ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో బీజేపీ ‘రైతన్న పోరు బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, పాయల శంకర్, ఎంపీ నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా విడుదల చేయాలని, ఫసల్ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు.