VSP: విశాఖపట్నం పెదవాల్తేరు ప్రాంతంలోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయంలో సోమవారం హుండీలు తెరిచి లెక్కించారు. 76 రోజుల వ్యవధిలో రూ.7,73,373 నగదు లభించినట్లు ఆలయ ఈఓ టి. రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.