ప్రకాశం: గుంటూరు- గుంతకల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా గిద్దలూరు మీదుగా వెళ్లే గుంటూరు-డోన్ రైలు (17228)ను పది రోజులపాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి 26వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే డోన్- గుంటూరు రైలును ఈనెల 17 నుంచి 27 వరకు రద్దు చేశారు.