VZM: కొత్తవలసలో బుధవారం వీచిన ఈదురుగాలులకు విశాఖ వెళ్లే బస్ స్టాప్ వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీ పడిపోయింది. ఆసమయంలో బస్ స్టాప్ వద్ద ప్రయాణికులు లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఫ్లెక్సీ అడ్డంగా ఉండడం వలన ప్రయాణికులు బస్సులు ఎక్కడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు ఫ్లెక్సీని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.