GNTR: మంగళగిరిలోని బాప్టిస్ట్ పేటలో పేకాట ఆడుతున్న స్థావరంపై గురువారం రాత్రి పోలీసులు దాడి చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై హరిబాబు తన సిబ్బందితో కలిసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.28,670 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.