VSP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం రాత్రి విశాఖపట్నం నగరానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు నగర డీసీపీ మేరీ ప్రశాంతి, విశాఖ ఆర్డీవో శేషశైలజ, గోపాలపట్నం తహశీల్దారు రమేష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ప్రధాన న్యాయమూర్తి శనివారం ఎండాడలో నిర్మించనున్న జ్యుడిషియల్ అతిథిగృహానికి శంకుస్థాపన చేయనున్నారు.