కోనసీమ: మండపేట విగ్రహాల సెంటర్ నామకరణలో రాజకీయం తగదని జాతీయ నాయకుల సెంటర్ విగ్రహాల కన్వీనర్ మందపల్లి రవికుమార్ పేర్కొన్నారు. మండపేట ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణా ప్రణాళికపై చర్చించారు. ఎప్పుడు కులమత విభేదాలు లేకుండా అందరూ సామరస్యంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పుకొచ్చారు.