అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం రాయచోటికి రానున్నారని మంత్రి కార్యాలయం తెలిపింది. మంత్రి ఆదివారం ఉదయం 6:30 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు రాయచోటి పట్టణంలోని తమ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొంది.