ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ శనివారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్‌ను కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మార్చి 4న జరగనున్న సమీక్షా సమావేశం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నడిమివంక రక్షణ గోడకు రూ.40 కోట్లు, జలజీవన్ మిషన్ పెండింగ్ బిల్లుల అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.