నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ వరకు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.