PLD: నరసరావుపేట రమ్య టైపు ఇన్స్టిట్యూట్ విద్యార్థిని షేక్ ఫాతిమా రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది. SBTET ఫిబ్రవరి 2026 టైప్‌రైటింగ్ తెలుగు హయ్యర్ గ్రేడ్ పరీక్షల్లో ఆమె 3వ ర్యాంక్ పొందింది. గుంటూరులో జరిగిన సత్కార కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉషారాణి, HOD శంకరరావు మెడల్ ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మహబూబ్ సుభాని పాల్గొన్నారు.