AKP: దేవరాపల్లి మండలం కె.ఎం.పాలెంలో తమరాన అప్పారావు(77) పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సంతానం లేక మానసిక ఆవేదనతో బాధపడుతూ.. మద్యానికి అలవాటు పడ్డాడని ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం పొలంలో అపస్మారక స్థితిలో కనిపించగా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వెల్లడించారు.