SKLM: మందస మండలం భేతాళపురం రైతులు కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణపై గళమెత్తారు. ప్రతిపాదిత భూముల జాబితాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పలాస ఆర్డీవో కార్యాలయం, తహసీల్దార్ శ్రీకాంత్‌కు వినతిపత్రాలు అందజేశారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.