NLR: నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యురాలు అంబటి హేమలత రెడ్డి పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. విజయనగరం జిల్లా రాజాంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 63 కేజీల మాస్టర్స్ కేటగిరీలో ఆమె విజయం అందుకున్నారు. హేమలత రెడ్డి ప్రస్తుతం న్యూరో వైద్యురాలిగా నిర్వహిస్తుండగా.. ఆమె భర్త పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు.