బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కాసేపట్లో RCB, CSK జట్ల మధ్య హైవోల్టేజ్ పోరు జరగనుంది. ఈ రెండు జట్లు గతంలో 35 మ్యాచ్ల్లో తలపడగా, CSK 21 విజయాలతో పైచేయి సాధించింది. RCB 13 మ్యాచ్ల్లో గెలవగా, ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 11 మ్యాచ్ల్లో ఇరుజట్లు చెరో 5 విజయాలతో సమానంగా ఉన్నాయి.