NGKL: జ్యోతిరావు ఫూలే, డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా మంగనూరులో ఏప్రిల్ 11 నుంచి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ అధ్యక్షుడు అల్వాల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. 14వ తేదీ వరకు సాగే ఈ పోటీల ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపుతూ మహానీయులను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.