WGL: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ నరుకుడు ఎలీషా వెంకటయ్య దంపతులు ఆదివారం రాయపర్తి మండల కేంద్రం, ఇల్లంద గ్రామంలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు జగ్జీవన్ రామ్ దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా, దేశానికి అనేక సేవలు అందించిన నాయకుడిగా కొనియాడారు.