VZM: వంగరలోని మడ్డువలస BR అంబేద్కర్ బాలికల గురుకులంలో ప్రవేశాలకు రేపు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాధిక శనివారం తెలిపారు. ఈ మేరకు ఉదయం 9:30 నుంచి 11 వరకు 5 వ తరగతి, 12 నుంచి 1:30 వరకు ఇంటర్మీడియట్కు పరీక్షలు జరుగుతాయన్నారు. ఫస్ట్ ఇయర్ MPCకి 50, బైపీసీకి 40 సీట్లు కేటాయించామని విద్యార్ధులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరాలన్నారు.