VZM: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాతో నిఘా పెడతామని బొబ్బిలి CI కె. నారాయణరావు తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం డ్రోన్ కెమెరా ఎగర వేశారు. అనంతరం మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగిన వారిని పట్టుకునేందుకు, పేకాట ఆడుతున్న వారిని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాతో నిఘా పెడతామన్నారు.