ప్రకాశం: కొత్తపట్నం మండలం అల్లూర గ్రామంలో గురువారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మతిస్థిమితం లేకుండా కొద్దిగ రోజులుగా తిరుగుతున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో పలుమార్లు ఇలానే ఉరి వేసుకునేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.