కోనసీమ: అమలాపురం పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ శుభవార్త చెప్పారు. ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి వడ్డీ పై 50 శాతం రాయితీ ఇస్తూ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ జీవో విడుదల చేసిందని అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ రాయితీ వర్తించాలంటే అసలు పన్నుతో పాటు మిగిలిన 50 శాతం వడ్డీని మార్చి 31వ తేదీ లోపు చెల్లించాలన్నారు.