TPT: పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రజల వినతులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టనున్నారు. ప్రజలు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరై తమ సమస్యలను నమోదు చేసుకోవాలని తహసీల్దార్ చంద్రబాబు నాయుడు కోరారు.