KRNL: హలహర్వి మండలం కమిన హల్ గ్రామానికి చెందిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. హలహర్వి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎద్దుల బండిని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి, క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.